
మహి ఖలియా
మరి కొన్న మాంసం కూర రుచులు |
సలహాలు & సూచనలు |
మరి కొన్న కూర రుచులు |
కావలసిన పదార్థాలు
* చేపముక్కలు - పావుకేజీ
* నువ్వులు - టేబుల్‌స్పూను
* జీడిపప్పు - పదిహేను
* అల్లంవెల్లుల్లి ముద్ద - టేబుల్‌స్పూను
* కొబ్బరిపొడి - రెండు టేబుల్‌స్పూన్లు
* ఉల్లిపాయలు - రెండు
* పచ్చిమిర్చి - ఐదు
* చింతపండు రసం - టేబుల్‌స్పూను
* జీలకర్ర - రెండు చెంచాలు
* కరివేపాకు రెబ్బలు - రెండు
* ఆవాలు - చెంచా
* నూనె - పావుకప్పు
* గసగసాలు - చెంచా
* పసుపు - పావుచెంచా
* ఉప్పు - తగినంత.
తయారుచేయు విధానం
గసగసాలూ, నువ్వులూ, జీడిపప్పూ, కొబ్బరి పొడి మిక్సీ జారులోకి తీసుకుని మెత్తని ముద్దలా చేసుకుని పెట్టుకోవాలి.
ఇప్పుడు బాణలిని పొయ్యిమీద పెట్టి నూనె వేడిచేసి జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలూ, ఆవాలు వేయించాలి. అవి వేగాక ఉల్లిపాయ ముక్కలు వేయించాలి.
అవి ఎరుపురంగులోకి వచ్చాక అల్లంవెల్లుల్లి ముద్ద, పసుపూ, తగినంత ఉప్పూ, చింతపండు రసం వేయాలి. చింతపండు రసం ఉడికి, నూనె పైకి తేలాక చేపముక్కలూ, కాసిని నీళ్లు పోసి మంట తగ్గించేయాలి.
చేపముక్కలు పూర్తిగా ఉడికాక ముందుగా చేసుకున్న మసాలా వేసి.. బాగా కలపాలి. ఇది గ్రేవీలా తయారయ్యాక దింపేయాలి.
No comments:
Post a Comment