ఆవిరి వడియాలు
బియ్యం - కప్పు పచ్చిమిర్చి - నాలుగు సగ్గుబియ్యం - రెండు చెంచాలు ఉప్పు - తగినంత నూనె - కొద్దిగా.
బియ్యాన్ని నాలుగు గంటల ముందు నానబెట్టుకోవాలి. అలాగే సగ్గుబియ్యాన్ని కూడా నానబెట్టుకోవాలి. నానిన బియ్యాన్ని శుభ్రంగా కడిగి మిక్సీలో మెత్తగా, గరిటెజారుగా రుబ్బి అందులో నానబెట్టుకున్న సగ్గుబియ్యం, పచ్చిమిర్చి మిశ్రమం, ఉప్పు వేసి బాగా కలపాలి.
ఒక చెంబులో సగానికి నీళ్లు తీసుకుని పొయ్యిమీద మరగనివ్వాలి. దానిపై సరిపడా మూతపెట్టి కొద్దిగా నూనె రాయాలి.
రుబ్బిపెట్టుకున్న మిశ్రమాన్ని చెంచాతో తీసుకుని ఈ మూతపై వేసి.. నిమిషం తరవాత తీసేయాలి.
ఇలా చేసుకున్న వాటన్నింటినీ ఎండలో ఆరనిస్తే.. నోరూరించే ఆవిరి వడియాలు తయారైనట్లే.
No comments:
Post a Comment