VTStyles

Recent Post

Friday, 26 August 2016

Sweets - Laddo - Popcorn Laddu / పాప్‌కార్న్‌ లడ్డూ

పాప్‌కార్న్‌ లడ్డూ


పాప్‌కార్న్‌- మూడు కప్పులు చక్కెర- ఒక కప్పు వెన్న- గరిటెడు నీళ్లు- ఒక కప్పు యాలకులు- రెండు బాదం- నాలుగు జీడిపప్పు- నాలుగు.

  • ఒక గిన్నెలో నీళ్లు పోసి, వేడెక్కాక చక్కెర వేసి బాగా కలిపి 10 నిమిషాలు ఉడకనివ్వాలి.

  • పాకానికి వచ్చాక యాలకులను దంచి వేయాలి. వెన్న కూడా వేసి కలిపి దించేయాలి.

  • కొంచెం వేడి తగ్గాక పాప్‌కార్న్‌ వేసి బాగా కలపాలి. బాదం, జీడిపప్పులను ముక్కలుగా చేసి వేసి లడ్డూలు చుట్టుకోవాలి.

No comments:

Post a Comment