బీరపొట్టు వడియాలు
మినప్పప్పు - కప్పు బీరకాయలు - కేజీ పచ్చిమిర్చి - ఆరు అల్లం - చిన్నముక్క జీలకర్ర - చెంచా తెల్లనువ్వులు - టేబుల్‌స్పూను ఉప్పు - సరిపడా.
మినప్పప్పును ముందురోజు రాత్రే నానబెట్టుకోవాలి. మర్నాడు గారెలపిండిలా గట్టిగా, మెత్తగా రుబ్బుకోవాలి.
అల్లం, పచ్చిమిర్చిని ముద్దలా చేసుకోవాలి. అంగుళం పొడవులో ఉండేలా బీరకాయల పొట్టు తీసుకోవాలి.
రుబ్బి పెట్టుకున్న మినప్పిండిలో అల్లం పచ్చిమిర్చి ముద్ద, మిగిలిన పదార్థాలు కలిపి.. వడియాల్లా ఎండబెట్టుకోవాలి. గాలిచొరని డబ్బాలోకి భద్రపరచుకుని వేయించుకోవచ్చు.
No comments:
Post a Comment