మరమరాల వడియాలు
సగ్గుబియ్యం - కప్పు నీళ్లు - నాలుగు కప్పులు మరమరాలు - నాలుగు కప్పులు పచ్చిమిర్చి ముద్ద - టేబుల్‌స్పూను జీలకర్ర - చెంచా తెల్లనువ్వులు - టేబుల్‌స్పూను ఉప్పు - రుచికి తగినంత.
గిన్నెలో నీళ్లు తీసుకుని ఒక పొంగు వచ్చేదాకా మరిగించి సగ్గుబియ్యం వేయాలి.
అవి పూర్తిగా ఉడికాక పచ్చిమిర్చి ముద్ద, ఉప్పు జీలకర్ర, తెల్లనువ్వులు వేసి బాగా కలిపి దింపేయాలి.
ఈ మిశ్రమం వేడి పూర్తిగా తగ్గాక మరమరాలు చేర్చాలి. ప్లాస్టిక్ కాగితంపై గరిటెతో వడియాల్లా వేసుకుని ఎండబెట్టాలి. కరకరలాడుతూ ఉంటాయివి.
No comments:
Post a Comment