VTStyles

Recent Post

Friday, 26 August 2016

Sweets - Laddo - Dates Badam Honey Balls / డేట్స్‌, బాదం, హనీ బాల్స్‌

డేట్స్‌, బాదం, హనీ బాల్స్‌


ఖర్జూరాలు: ఒక కప్పు బాదం - అర కప్పు నువ్వులు - అరకప్పు ఎండు కొబ్బరి తురుము - అర కప్పు కొబ్బరి పొడి - అర కప్పు తేనె - మిశ్రమాన్ని బాల్స్‌ చేయడానికి తగినంత.

  • ముందుగా బాదం పప్పు, కొబ్బరి తురుము, నువ్వులను కలిపి మిక్సీలో వేసి బరకగా గ్రైండ్‌ చేసుకోవాలి. తరువాత అందులో ఎండు ఖర్జూరంలోని గింజలు తీసేసి ఖర్జూరం తొనలు వేసి మరొకసారి గ్రైండ్‌ చేసుకోవాలి.

  • ఇప్పుడు ఈ మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకుని అందులో తేనె కలిపి లడ్డూలుగా చేయాలి. తర్వాత ఈ లడ్డూలను కొబ్బరి పొడిలో అద్దాలి.

  • లడ్డూకు అన్నివైపులా కొబ్బరి పొడి పట్టేటట్లు చూడాలి. ఇది చాలా బలవర్ధకమైన ఆహారం. డేట్స్‌, బాదం, హనీ బాల్స్‌ రెడీ.

No comments:

Post a Comment