జొన్న పిండి లడ్డు
జొన్న పిండి - ఒకటిన్నర కప్పు బాదం పప్పు - 15 నువ్వులు - 3 టే.స్పూన్లు జీడిపప్పు - 15 ఖర్జూరం - 25 అల్లం పొడి - పావు కప్పు నువ్వులు - 3 టే.స్పూన్లు యాలకులు - 3 నెయ్యి - 4 టే.స్పూన్లు
పప్పుల్ని నూనె లేకుండా వేయించి పొడి చేసుకోవాలి. ఖర్జూరాలు విత్తనాలు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
నువ్వుల్ని వేయించాలి. అందులో రెండు టే.స్పూన్ల నువ్వుల్ని పొడి చేయాలి. మిగతావి అలాగే ఉంచాలి.
బాణీలో నెయ్యి వేసి జొన్న పిండిని చిన్న మంట మీద వేయించుకోవాలి. కమ్మటి వాసన వచ్చేవరకూ వేయించి మంట తీసి బెల్లం తరుగు కలపాలి.
దీనికి జీడిపప్పు, నువ్వులు, బాదం పొడులతోపాటు ఖర్జూరం ముక్కలు కలపాలి. తర్వాత కొద్ది కొద్దిగా నెయ్యి చేర్చుతూ లడ్డూలు చుట్టి వాటిని వేయించి పక్కన పెట్టుకున్న నువ్వుల్లో దొర్లించాలి.
No comments:
Post a Comment