మసాలా మఠ్రీ
మైదా పిండి - 2 కప్పులు గోధుమ పిండి - అర కప్పు శనగ పిండి - అర కప్పు జీలకర్ర - అర టీ స్పూన్ కారం - 1 టీ స్పూన్ మిరియాల పొడి - అర టీ స్పూన్ ఉప్మా రవ్వ - పావు కప్పు ఇంగువ - చిటికెడు నూనె - సరిపడా మసాలా - అర టీ స్పూన్ ఉప్పు - తగినంత
ముందుగా ఓ పెద్ద బౌల్‌లో మైదా, గోధుమ పిండి, శనగ పిండి వేసి కలపాలి. అందులో ఉప్మా రవ్వ, జీలకర్ర, ఉప్పు, కారం, మిరియాల పొడి, మసాలా, ఇంగువ కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు అందులో నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా చేసి, కాసేపు పక్కన ఉంచాలి.
10 నిమిషాల తర్వాత ఆ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకొని మీకు నచ్చిన షేపులో ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టౌ పై ప్యాన్ పెట్టి, నూనె పోయాలి. అది వేడెక్కాక మఠ్రీలను డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని చాయ్ లాంటి పానీయాల్లోకి సర్వ్ చేసుకోవచ్చు.
No comments:
Post a Comment