సగ్గుబియ్యం దోశ
సగ్గుబియ్యం- అర కప్పు పెరుగు- పావు కప్పు ఉప్పుడు బియ్యం లేదా మామూలు బియ్యం- ఒక కప్పు తరిగిన ఉల్లిపాయ- ఒకటి మిరియాల పొడి- అర టీ స్పూను అల్లం తురుము- ఒక టీ స్పూను కరివేపాకు రెబ్బలు- ఆరు ఆవాలు- అర టీ స్పూను తరిగిన కొత్తిమీర- ఒక టీ స్పూను నూనె- సరిపడా ఉప్పు- తగినంత.
ముందుగా సగ్గుబియ్యాన్ని పెరుగులో, బియ్యాన్ని నీళ్లలో 5 గంటల సేపు నానబెట్టుకుని, రెండిటిని కలిపి మెత్తగా రుబ్బుకోవాలి.
బాణలిలో నూనె పోసి వేడెక్కాక ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం తురుము వేసి వేగించాలి. తర్వాత కొత్తిమీర, మిరియాల పొడి కూడా వేసి వాటన్నిట్నీ కలిపి మెత్తగా రుబ్బుకోవాలి.
ఈ మిశ్రమాన్ని దోశల పిండిలో కలిపి పెనంపై నెయ్యి లేదా నూనెతో దోశలు వేసుకోవాలి. ఇవి బంగారు వర్ణంలో ఉంటాయి.
No comments:
Post a Comment