VTStyles

Recent Post

Thursday, 17 September 2015

CommonMeal - Drinks - Misty Dahi

మిస్టీ దహీ


వెన్న తీయని పాలు - అరలీటరు పంచదార - 350 గ్రాములు పెరుగు - 30 గ్రాములు కొద్దిగా లోతు వెడల్పు ఉన్న చిన్న మట్టికుండ..

  • పాలల్లో 200 గ్రాముల పంచదార వేసి సన్నని సెగమీద 45 నిమిషాల పాటు మరగ కాచండి. పాలు కాగుతున్నంత సేపూ గరిటతో తిప్పుతూనే ఉండండి.

  • పాలు చిక్కగా లేత ఎరుపు రంగుకి మారగానే దించి పక్కకు పెట్టండి. మిగిలిన 100 గ్రాముల పంచదారని మందపాటి గిన్నెలోకి తీసుకుని 50 మి.లీ నీళ్లు పోసి కలుపుతూ ముదురు ఎరుపురంగులోకి మారే వరకూ సన్నని సెగపై ఉంచండి.

  • ఈ పంచదారని కొద్దికొద్దిగా కాగినపాలలో కలిపి మళ్లీ 15 నిమిషాల వరకూ కాచండి. సెగ తీసివేసి మిశ్రమం గోరువెచ్చగా మారేంతవరకూ గిలకొడుతూనే ఉండండి. తరువాత దానిని మట్టికుండలోకి మార్చి ఐదునిమిషాల తరువాత పెరుగుని చేర్చండి.

  • కొంచెం చల్లగా ఉన్నచోట మట్టికుండని పెట్టి దానిని పూర్తిగా బట్టతో కప్పి 8-12 గంటలు కదపకుండా ఉంచండి. ఈ సమయం పూర్తయ్యేంత వరకూ దానిని తెరచి చూడకూడదు..కదిలించకూడదు. తరువాత తీసి కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి చల్లగా తినండి.

No comments:

Post a Comment