వెలగపండు షర్బత్ |
వెలగపండు - 1 (సుమారు 700 గ్రా. బరువుండాలి) బెల్లం పొడి - 200 గ్రా. నిమ్మరసం - అర చెక్క నల్ల ఉప్పు - 1 టీ స్పూను పుదీనా - 4 రెబ్బలు నీరు - 4 గ్లాసులు ఐస్ క్యూబ్స్ - తగినన్ని.
వెలగగుజ్జుని 2 కప్పుల చల్లని నీటిలో వేసి మూతపెట్టి కనీసం గంటపాటు పక్కనుంచాలి.
షర్బత్ తయారుచేసుకునేముందు బెల్లం పొడిని కప్పు చల్లని నీటిలో కరిగించాలి. ఒక పాత్రలో పిసికిన గుజ్జును, బెల్లాన్ని వడకట్టాలి (ఇలా చెయ్యడం వలన గింజలు షర్బత్‌లో కలవవు).
ఇప్పుడు ఈ మిశ్రమంలో మరో రెండు గ్లాసుల నీరు పోసి నల్ల ఉప్పు, నిమ్మరసం కలిపి ఫ్రిజ్‌లో ఉంచాలి.
తాగేముందు ఐస్‌క్యూబ్స్ వేసి, పుదీనా ఆకులతో అలంకరించాలి.
No comments:
Post a Comment