అంజీర్ ఐస్ |
చిక్కని పాలు - అరలీటరు వెన్నతీసిన పాలు - అరలీటరు గిలకొట్టిన క్రీం - టేబుల్‌స్పూను అంజీర్ - ఏడు.
ఓ గిన్నెలో చిక్కని పాలూ, వెన్నతీసిన పాలూ, గిలకొట్టిన క్రీం తీసుకుని అన్నింటినీ బాగా కలపాలి. మిక్సీ జార్‌లో ఐదు అంజీర్ పండ్లు, కాసిని పాలు తీసుకుని మెత్తని గుజ్జులా చేసుకోవాలి.
మిగిలిన పండ్లను సన్నగా తరగాలి. ఇప్పుడు అంజీర్ గుజ్జునీ, అంజీర్ ముక్కల్ని ముందుగా కలిపిన పాల మిశ్రమంలో వేసుకుని ఫ్రీజర్‌లో ఉంచేయాలి.
ఇది గట్టిగా అయ్యాక బయటకు తీసి.. మరోసారి మిక్సీలో వేసుకుని మెత్తని గుజ్జులా చేసుకుని మళ్లీ డీప్ ఫ్రీజర్‌లో ఉంచేయాలి. ఇలా రెండోసారి మిక్సీపట్టి, మళ్లీ ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల ఐస్‌క్రీం మెత్తగా వస్తుంది.
No comments:
Post a Comment