బనానా ఐస్ |
చిక్కని లైట్ క్రీం - రెండూ కలిపి నాలుగు కప్పులు చక్కెర - రెండున్నర కప్పులు ఉప్పు - చిటికెడు గుడ్లు - నాలుగు గిలకొట్టిన క్రీం - నాలుగు కప్పులు చిక్కని పాలు - అరలీటరు వెనిల్లా ఎసెన్స్- టేబుల్‌స్పూను అరటిపండు గుజ్జు - రెండు కప్పులు.
ఒక పెద్ద పాన్‌లో చిక్కని, లైట్ క్రీంని కప్పు చొప్పున వేసి సన్నని మంటపై ఉంచి వేడి చేయాలి. తరవాత అందులో చక్కెరా, ఉప్పు వేసి బాగా కలపాలి. చక్కెర కరిగేలోగా గుడ్ల సొనను ఓ గిన్నెలో తీసుకుని బాగా గిలకొట్టాలి.
ఈ మిశ్రమంలో కాసిని వేడి పాలు వేసుకుని బాగా కలపాలి. తరవాత మిగిలిన పాలల్లో గుడ్ల సొన వేసి మరోసారి కలపాలి. దీన్ని సన్నని మంటపై ఉంచి బాగా కలపాలి.
ఇందులో ఒక చెంచాను ముంచితే దానికి ఈ మిశ్రమం అంటుకుంటే వెంటనే దింపేసి పొయ్యి కట్టేయాలి. ఇది చాలా త్వరగా చల్లారాలి. అందుకే ఈ గిన్నెను చల్లని నీళ్లున్న బేసిన్‌లో ఉంచాలి.
ఇందులో గిలకొట్టిన క్రీం, పాలూ, వెనిల్లా ఎసెన్స్ వేసి బాగా కలిపి... దానిపై ప్లాస్టిక్ కాగితాన్ని కప్పి ఫ్రిజ్‌లో నాలుగు నుంచి ఆరు గంటల పాటు చల్లబరుచుకోవాలి.
ఆ తరవాత అందులో అరటి గుజ్జు వేసుకుని మెత్తని మిశ్రమంలా అయ్యేవరకూ కలిపి మళ్లీ రెండు నుంచి నాలుగు గంటలు డీప్ ఫ్రీజర్‌లో ఉంచాలి.
No comments:
Post a Comment