![]() |
మరి కొన్ని ఐస్‌క్రీం రుచులు |
కావలసిన పదార్థాలు
*కార్న్‌ఫ్లోర్ - 2 టే.స్పూన్లు
* చక్కెర - 1 కప్పు
* పాలు - 2 కప్పులు
* గుడ్లు - 2 (తెలుపు
* పసుపు సొనల్ని విడివిడిగా బీట్ చేసుకోవాలి)
* వెనిల్లా ఎసెన్స్ - 4 చుక్కలు
* బొప్పాయి గుజ్జు - 4 కప్పులు
తయారుచేయు విధానం
బొప్పాయి గుజ్జు, చక్కెర, కార్న్‌ఫ్లోర్‌లు గిన్నెలో వేసి కలపాలి.
దీన్లో నెమ్మదిగా పాలు పోస్తూ కలపాలి..పొయ్యి మీద ఉంచి కలుపుతూ గరిటెకు అంటుకునేవరకూ ఉడికించి చల్లార్చాలి.
తర్వాత గుడ్లు తెల్లసొన, వెనిల్లా వేయాలి.బాగా కలిపి ఫ్రిజ్‌లో ఉంచాలి.
కాస్త గట్టిపడిన తర్వాత ఫ్రిజ్ నుంచి బయటకు తీసి బొప్పాయి గుజ్జు కలపాలి.
మరో గంటపాటు ఫ్రిజ్‌లో ఉంచి బయటకు తీసి కలిపి బౌల్స్‌లో వేసుకుని తింటే చల్లచల్లగా బాగుంటుంది.
No comments:
Post a Comment