నువ్వుల |
చింతచిగురు - కప్పు నువ్వులు - మూడు చెంచాలు ఆవాలు - చెంచా ధనియాలు - చెంచా మెంతులు - పావు చెంచా ఎండుమిర్చి - పది పచ్చిమిర్చి - ఐదు నూనె - టేబుల్‌స్పూను కరివేపాకు - రెండు రెబ్బలు మినప్పప్పు సెనగపప్పు - అరచెంచా చొప్పున ఇంగువ - చిటికెడు ఉప్పు - తగినంత.
బాణలిలో నూనె వేడిచేసి ఇంగువా, నువ్వులూ, ఆవాలూ, ధనియాలూ, మెంతులూ, ఎండుమిర్చి, మినప్పప్పూ, సెనగపప్పు వేసి వేయించుకోవాలి.
అన్నీ వేగాక దింపేసి కరివేపాకూ, కడిగిన చింతచిగురూ తాలింపులో వేసేయాలి. ఈ తాలింపు చల్లారాక మిక్సీ జారులోకి తీసుకుని, పచ్చిమిర్చి, తగినంత ఉప్పూ వేసుకుని మెత్తగా రుబ్బుకుంటే చాలు.
కావాలనుకుంటే ఇందులో కొద్దిగా నిమ్మరసం కూడా పిండుకోవచ్చు. నోరూరించే చింతచిగురు పచ్చడి సిద్ధం.
No comments:
Post a Comment