తర్బూజా ఐస్‌క్రీమ్ |
తర్బూజా పండు - 1 చిక్కని పాలు - 1 లీటరు తాజా క్రీమ్ - 1 కప్పు చక్కెర - 3/4 కప్పులు కార్న్ ఫ్లోర్ - 2 టే.స్పూన్లు వెనిల్లా ఎసెన్స్ - 2 చుక్కలు.
తర్బూజా పండు గుజ్జు చేసి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.పాలు కాగబెట్టి పావు లీటరు పాలు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.చల్లబడ్డ పాలలో కార్న్‌ఫ్లోర్ కలపాలి.మిగతా పాలను పావుగంటపాటు మరిగించాలి.
ఈ పాలలో ముందుగా కార్న్‌ఫ్లోర్ కలిపిన పాలను కొద్దికొద్దిగా పోస్తూ కలపాలి.చిన్న మంట మీద 3 నిమిషాలు మరిగించాలి.మంట తీసి చక్కెర, ఎసెన్స్ వేసి కరిగేవరకూ తిప్పి రూమ్ టెంపరేచర్‌కు చల్లార్చాలి.
ప్లాస్టిక్ మూత పెట్టి గడ్డకట్టేవరకూ కాకుండా గట్టిపడేవరకూ ఫ్రీజర్‌లో ఉంచాలి.తర్వాత తీసి మెత్తబడేవరకూ స్పూన్‌తో బీట్ చేయాలి.
తాజా క్రీమ్‌ను కూడా బాగా బీట్ చేసి ఐస్‌క్రీమ్‌కు కలపాలి.తర్వాత తర్బూజా గుజ్జును వేసి కలిపి ఫ్రీజర్‌లో ఉంచాలి.
బాగా సెట్ అయ్యాక బౌల్స్‌లో తీసి తింటే టేస్టీగా ఉంటుంది.
No comments:
Post a Comment