![]() |
మరి కొన్ని కుల్ఫీ రుచులు |
కావలసిన పదార్థాలు
*పెద్ద మామిడి పళ్ళు- 2
* పాలు- 4 కప్పులు
* క్రీం- 1/2 కప్పు
* కండెన్సడ్ మిల్క్(స్వీట్)- అరలీటరు
* పిస్తా
* బాదం తురుము- 1 టేబుల్ స్పూను
* కుంకుమపువ్వు- అరటీస్పూను
* పంచదార- 1 కప్పు.
తయారుచేయు విధానం
పాలు సగం అయ్యేవరకూ మరిగించాలి. తరువాత క్రీం, కండెన్సడ్ మిల్క్‌లను కూడా పోసి సన్నని మంటమీద పదార్థం చిక్కగా క్రీంలా అయ్యేవరకూ కలుపుతూ ఉడికించాలి.
ఆ తరువాత పంచదార వేసి మరో రెండు నిమిషాలు ఉడికించి పిస్తా, బాదం తురుము, కుంకుమపువ్వు వేసి దించేయాలి.
తరువాత మామిడిపండు చెక్కుతీసి, సగానికి కోసి టెంక తీసివేయాలి. ముక్కల మధ్య భాగంలో కొంత గుజ్జును తీసేసి ఆ ఖాళీలో పాలమిశ్రమాన్ని పోసి ఐదారుగంటలపాటు డీప్ ఫ్రీజర్‌లో ఉంచాలి.
No comments:
Post a Comment