మినపపప్పు వడ |
మినపపప్పు 90 గ్రాములు పచ్చి మిరపకాయలు రెండు అల్లం చిన్న ముక్క జీలకర్ర ఒక టీ స్పూన్ మిరియాలపొడి చిటికెడు గసగసాలు ఒక టీ స్పూన్ నల్ల నువ్వులు రెండు టీ స్పూన్‌లు తెల్ల నువ్వులు రెండు టీ స్పూన్‌లు ఉప్పు తగినంత
ముందుగా పప్పును ఒక గంట నానబెట్టాలి. నీటిని కలుపుతూ మెత్తగా రుబ్బుకోవాలి. పిండిలో ఉప్పు, జీలకర్ర, మిరియాల పొడి, పచ్చి మిరపకాయ, అల్లం ముక్కలు, నువ్వులు, గసగసాలు మొత్తం కలుపుకోవాలి.
పదార్థాలన్నీ కలిసే విధంగా పిండిని చేత్తో బాగా కలియబెట్టాలి. తర్వాత చిన్న చిన్న ఉండలుగా తీసుకుని వడలుగా చేస్తూ నూనెలో వేయాలి. నూనెలో బాగా వేగిన తర్వాత తీయాలి.
No comments:
Post a Comment