పుదీనా కొత్తిమీర |
పుదీనా కొత్తిమీర - గుప్పెడు చొప్పున అల్లం - చిన్నముక్క యాలకులు - నాలుగు తాజా బెల్లం తరుగు - రెండున్నర టేబుల్‌స్పూన్లు నిమ్మరసం - చెంచా
ఓ గిన్నెలో బెల్లం తరుగు తీసుకుని అందులో కప్పు నీళ్లు పోయాలి. బెల్లం కరిగాక వడకట్టుకోవాలి.
ఇప్పుడు మిగిలిన పదార్థాలన్నీ మిక్సీ జారులోకి తీసుకుని మరీ మెత్తగా కాకుండా రుబ్బుకోవాలి. దీన్ని బెల్లం నీటిలో వేసి బాగా కలిపి గ్లాసులోకి తీసుకోవాలి. పుదీనా పాకం సిద్ధం.
బెల్లం ఇష్టం లేనివాళ్లు తేనె వేసుకోవచ్చు. కావాలనుకుంటే దీన్ని వడకట్టుకుని కూడా తాగొచ్చు.
No comments:
Post a Comment