పుదీనా స్క్వాష్ |
తాజా పుదీనా ఆకులు - రెండుకప్పులు నిమ్మకాయలు - రెండు చక్కెర - రెండున్నర కప్పులు నీళ్లు - గ్లాసు అల్లం తరుగు - పావు చెంచా.
అడుగు మందంగా ఉన్న గిన్నెలో నీళ్లూ, చక్కెరా తీసుకుని పొయ్యి మీద పెట్టాలి. చక్కెర కరిగి, మరీ ముదురు, మరీ లేతగా కాకుండా మధ్యస్థంగా పాకం అయ్యాక దించాలి.
ఇది పూర్తిగా చల్లారాక పుదీనా ఆకుల తరుగుతోపాటూ మిగిలిన పదార్థాలన్నీ వేసి ఓ నాలుగైదు గంటలు వదిలేయాలి. ఈ పదార్థాల సారం అంతా పాకంలో కలుస్తుంది. అప్పుడు గాజు సీసాలోకి మార్చుకుని ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. /P>
కావల్సినప్పుడల్లా ఓ గ్లాసు చల్లని నీటిలో రెండుమూడు చెంచాలు వేసుకుని తాగొచ్చు. ఈ స్క్వాష్‌లో ఎలాంటి రసాయనాలూ ఉండవు కాబట్టి.. రెండు రోజులకోసారి అప్పటికప్పుడు తాజాగా చేసుకుంటే మంచిది.
No comments:
Post a Comment