వంకాయ పల్లీ మసాలా |
వంకాయలు(గుండ్రనివి): పావుకిలో ఉల్లిపాయలు: రెండు అల్లం: చిన్నముక్క జీలకర్రపొడి: పావుటీస్పూను కారం: అరటీస్పూను కొత్తిమీర: కట్ట నిమ్మరసం: 2 టీస్పూన్లు ఉప్పు: తగినంత వేరుసెనగపప్పు: 100 గ్రా. సెనగపిండి: 150 గ్రా. నూనె: వేయించడానికి సరిపడా
వంకాయల్ని తొడిమలు తీసి గుత్తివంకాయల మాదిరిగానే కోసి ఉప్పునీటిలోనే ఉంచాలి. తరవాత వీటిని నూనెలో వేయించి తీసి పక్కన ఉంచాలి.
సెనగపిండిలో కాస్త ఉప్పు, పావు టీస్పూను కారం వేసి బజ్జీలపిండిలా జారుగా కలపాలి.
పల్లీలను వేయించి ఉంచాలి. వీటికి సన్నగా తరిగిన ఉల్లిముక్కలు, అల్లం ముక్కలు, మిగిలిన కారం, జీలకర్రపొడి, ఉప్పు, కొత్తిమీర తురుము, నిమ్మరసం చేర్చి బాగా కలపాలి.
ఇప్పుడు వంకాయల్ని వేయించి తీసిన బాణలిలో నూనె పోయాలి. వేయించిన వంకాయల్ని సెనగపిండి మిశ్రమంలో ముంచి నూనెలో మరోసారి వేయించి తీయాలి.
ఇప్పుడు పల్లీ మిశ్రమాన్ని వేయించిన వంకాయల్లో కూరి వడ్డించండి.
No comments:
Post a Comment