![]() |
మరి కొన్ని పొడి రుచులు |
కావలసిన పదార్థాలు
*ఎండు కొబ్బరి కుడకలు - రెండు
* పుట్నాలపప్పు - 100 గ్రాములు
* ఎండుమిరపకాయలు - 12
* ఉప్పు - తగినంత
* పసుపు - చిటికెడు.
తయారుచేయు విధానం
స్టౌ మీద గిన్నె పెట్టి వేడెక్కాక ఎండుమిరపకాయలు వేసి కొద్దిగా వేయించి దించుకోవాలి.
కొబ్బరికుడకలను చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి.
అందులో పుట్నాలపప్పు, వేయించిన ఎండుమిరపకాయలు, కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేయాలి. వీటన్నింటినీ మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
No comments:
Post a Comment