కరివేపాకుపొడి |
కరివేపాకు - ఐదు కట్టలు మినప్పప్పు - ఒక టేబుల్ జీలకర్ర - ఒక టీ స్పూను ఎండు మిరపకాయలు - ఎనిమిది చింతపండు - నిమ్మకాయసైజు పసుపు - అర టీ స్పూను ఉప్పు - తగినంత నూనె - తగినంత.
ముందుగా కరివేపాకుని నీళ్లలో వేసి శుభ్రంగా కడుక్కోవాలి. దీని ఒక బట్టపై వేసి ఆరబెట్టుకోవాలి.
తడి ఆరిన ఆకుని రెండు రోజులు నీడలో ఆరబెట్టాలి. ఇప్పుడు స్టౌ వెలిగించి గిన్నె పెట్టి కొద్దిగా నూనె వేసి మినప్పప్పు, జీలకర్ర వేయించుకోవాలి.
వీటిని తీసేసి ఎండు మిరపకాయలు కూడ కొద్దిగా వేయించుకుని తీసేయాలి. ఇప్పుడు కరివేపాకు వేసి బాగా వేయించాలి.
ఇందులో చింతపండు కూడా వేయాలి. ఇప్పుడు ఇవన్నీ మిక్సీలో వేసి సరిపడా ఉప్పు, పసుపు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
No comments:
Post a Comment