![]() |
మరి కొన్ని పొడి రుచులు |
కావలసిన పదార్థాలు
* ధనియాలు - 100 గ్రాములు
* మినప్పప్పు - ఒక టేబుల్ స్పూను
* శెనగపప్పు - ఒక టేబుల్ స్పూను
* ఎండు మిరపకాయలు - 10
* పసుపు - అర టీ స్పూను
* ఉప్పు - తగినంత
* నూనె - సరిపడా.
తయారుచేయు విధానం
స్టౌ మీద మందపాటి గిన్నె పెట్టి కొద్దిగా నూనె వేసి శెనగపప్పు, మినప్పప్పు వేయించాలి. ఎర్రగా వేగాక వాటిని తీసి ఒక పేపర్‌పై వేసుకోవాలి.
అదే గిన్నెలో ధనియాలు, ఎండుమిరపకాయలు వేసి కొద్దిగా వేయించి దించేయాలి. బాగా చల్లారాక కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసి మిక్సీలో పొడి చేసుకోవాలి.
No comments:
Post a Comment