VTStyles

Recent Post

Showing posts with label Preservatives_Powders_Masala. Show all posts
Showing posts with label Preservatives_Powders_Masala. Show all posts

Sunday, 15 May 2016

Powders - Bajji Masala Podi / బజ్జీ మసాలా పొడి

బజ్జీ మసాలా పొడి


ధనియాలు - పావుకిలో జీలకర్ర - 50 గ్రాములు గసగసాలు - 50 గ్రాములు సోంపు - 50గ్రాములు అనాసపువ్వు - 50 గ్రాములు జాపత్రి - 50 గ్రాములు జాజికాయ - 50 గ్రాములు మరాఠిమొగ్గ - 50 గ్రాములు వెల్లుల్లి - 50 గ్రాములు నువ్వులు - 50 గ్రాములు.

  • ధనియాలను కొద్దిగా వేయించి పక్కన పెట్టుకోవాలి. జీలకర్ర, సోంపు కూడా కొద్దిగా వేడి చెయ్యాలి.

  • చల్లారాక ఇందులో మిగతా మసాల దినుసులన్నీ వేసి మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.

Wednesday, 11 May 2016

Powders - Sambar Powder / సాంబారుపొడి

సాంబారుపొడి

సాంబారుపొడి

శెనగపప్పు - రెండు టేబుల్‌ స్పూన్లు ఎండుమిరిపకాయలు - 5 ధనియాలు - ఒక టేబుల్‌ స్పూను జీలకర్ర - ఒక టీ స్పూను ఇంగువ - కొద్దిగా మెంతులు - ఒక టీ స్పూను ఉప్పు - తగినంత నూనె - తగినంత పసుపు - అర టీ స్పూను.

  • స్టౌ వెలిగించి మందపాటి గిన్నె పెట్టి కొద్దిగా నూనె వేసి శెనగపప్పు దోరగా వేయించాలి.

  • తరువాత మెంతులు, జీలకర్ర, ధనియాలు, ఇంగువ, ఎండు మిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి.

  • వీటిని చల్లారనిచ్చి తగినంత ఉప్పు, పసుపు వేసి మిక్సీలో మెత్తగా పొడి చేసుకోవాలి.

Powders - Coriander Seed/Dhaniya Powder / ధనియాల పొడి

ధనియాల పొడి


ధనియాలు - 100 గ్రాములు మినప్పప్పు - ఒక టేబుల్‌ స్పూను శెనగపప్పు - ఒక టేబుల్‌ స్పూను ఎండు మిరపకాయలు - 10 పసుపు - అర టీ స్పూను ఉప్పు - తగినంత నూనె - సరిపడా.

  • స్టౌ మీద మందపాటి గిన్నె పెట్టి కొద్దిగా నూనె వేసి శెనగపప్పు, మినప్పప్పు వేయించాలి. ఎర్రగా వేగాక వాటిని తీసి ఒక పేపర్‌పై వేసుకోవాలి.

  • అదే గిన్నెలో ధనియాలు, ఎండుమిరపకాయలు వేసి కొద్దిగా వేయించి దించేయాలి. బాగా చల్లారాక కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసి మిక్సీలో పొడి చేసుకోవాలి.

Powders - Sonti Podi / సొంటిపొడి

సొంటిపొడి


సొంటి - 100 గ్రాములు ఉప్పు - తగినంత.

  • సొంటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.

  • ఈ పొడిలో సొంటి నారలు ఉంటాయి కాబట్టి దీన్ని జల్లెడ పట్టుకోవాలి. జల్లెడ పట్టాక వచ్చిన పొడిని సీసాలో భద్రపరుచుకోవాలి.

  • ఎప్పుడు తీనాలనిపిస్తే అప్పుడు ఉప్పు కలుపుకోవాలి. అన్నంలో తినేటప్పుడు నెయ్యి వేసుకుని తినాలి.

Powders - Nuvvula Podi / నువ్వులపొడి

నువ్వులపొడి


నువ్వులు - 100 గ్రాములు పల్లీలు - 50 గ్రాములు పుట్నాలు - 50 గ్రాములు మెంతులు - ఒక టీ స్పూను జీలకర్ర - ఒక టీ స్పూను ఎండు మిరపకాయలు - 10 ధనియాలు - ఒక టేబుల్‌ స్పూను ఎండు కొబ్బరి పొడి - ఒక టేబుల్‌ స్పూను పసుపు - అర టీ స్పూను ఉప్పు - తగినంత.

  • స్టౌ మీద మందపాటి గిన్నె పెట్టి నువ్వుల్ని వేయించి దించేయాలి.

  • తరువాత పల్లీలను కూడా వేసి దోరగా వేగనిచ్చి తీసేయాలి. తరువాత పుట్నాలు వేసి వేడెక్కాక తీసేయాలి.

  • ఈసారి మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ధనియాలు, ఎండు కొబ్బరి పొడి వేసి కొద్దిగా వేగనిచ్చి తీసేయాలి. ఇవన్నీ బాగా చల్లారాక తగింత ఉప్పు, పసుపు వేసి మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.