![]() |
మరి కొన్ని రైతా రుచులు |
కావలసిన పదార్థాలు
*కొత్తిమీర - కట్ట
* పుదీనా - కట్ట
* చిక్కటి పెరుగు - కప్పు
* ఉప్పు - తగినంత
* పచ్చిమిర్చి - రెండు
* వేయించిన జీలకర్రపొడి - ముప్పావుచెంచా
* చాట్‌మసాలా - పావుచెంచా.
తయారుచేయు విధానం
పుదీనా, కొత్తమీరా, పచ్చిమిర్చీ బాగా కడిగి మిక్సీ జారులోకి తీసుకుని మెత్తని ముద్దలా చేసుకోవాలి. దీన్ని గిలకొట్టిన పెరుగులో వేసి బాగా కలపాలి.
తరవాత ఉప్పూ, జీలకర్రపొడీ, చాట్‌మసాలా వేసుకుని బాగా కలిపితే చాలు. పుదీనా రైతా సిద్ధం. దీన్ని బిర్యానీలాంటి వాటితోనే కాదు, చపాతీలతోనూ తినొచ్చు.
No comments:
Post a Comment