సొరకాయ రైతా |
చిక్కని పెరుగు - కప్పు పాలు - అరకప్పు సొరకాయ తురుము - కప్పు నూనె - రెండు చెంచాలు జీలకర్ర - చెంచా ఇంగువ - చిటికెడు ఎండుమిర్చి - రెండు అల్లం తరుగు - చెంచా కొత్తిమీర - కట్ట (సన్నగా తరగాలి) ఉప్పు - తగినంత.
పెరుగూ, పాలూ ఓ గిన్నెలో తీసుకుని క్రీంలా అయ్యేవరకూ గిలకొట్టి పెట్టుకోవాలి.
ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి జీలకర్రా, ఇంగువా, ఎండుమిర్చీ వేయించుకోవాలి. రెండు నిమిషాల తరవాత సొరకాయ తురుమూ, అల్లం, కొత్తిమీర తరుగూ, సరిపడా ఉప్పూ వేసి వేయించి మూత పెట్టేయాలి.
ఐదారు నిమిషాలకు సొరకాయ తురుములోని పచ్చివాసన పోయి, కూరలా దగ్గరకు అవుతుంది. అప్పుడు దింపేయాలి. ఇది బాగా చల్లారాక పెరుగులో వేసి కలిపితే చాలు.
No comments:
Post a Comment