VTStyles

Recent Post

Tuesday, 21 June 2016

Curry - NonVeg - Chicken Karahi

చికెన్‌ కరాహి


చికెన్‌:అరకిలో (ముక్కలుగా చేసుకోవాలి) టమోటాలు: మూడు(ముద్ద చేసుకోవాలి) అల్లం:చిన్న ముక్క(సన్నగా తరిగి పెట్టుకోవాలి) అల్లం వెల్లుల్లి ముద్ద: రెండు టేబుల్‌ స్పూన్లు పచ్చిమిర్చి: నాలుగు లేక ఐదు(ముక్కలుగా చేసుకోవాలి) ధనియాల పొడి: టేబుల్‌ స్పూను జీలకర్ర పొడి: టేబుల్‌ స్పూను పసుపు: చిటికెడు కారం: టేబుల్‌ స్పూను ఉప్పు: రుచికి సరిపడ నూనె: పావుకప్పుకొత్తిమీర: కొద్దిగా

  • మందపాటి గిన్నెలో నూనె పోసి కాగిన తరువాత అల్లం వెల్లుల్లి ముద్ద వేసి సన్నని మంట మీద వేయించుకోవాలి.

  • అనంతరం ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి ఓ నిమిషం పాటు వేయించుకుని తరువాత చికెన్‌ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలిపి సన్నని మంట మీద ఉడికించాలి.

  • చికె న్‌ కొద్దిగా ఉడికిన తరువాత టమోటా ముద్ద, ఉప్పు, కారం, పసుపు వేసి అవసరం అనుకుంటే కొద్దిగా నీరు పోసి ఉడికించాలి. కూర ముద్దగా అవుతున్న సమయంలో అల్లం ముక్కలు, కొద్దిగా కొత్తిమీర జతచేసి దింపేయాలి.

No comments:

Post a Comment