VTStyles

Recent Post

Tuesday, 21 June 2016

Curry - NonVeg - Murg Masala

ముర్గ్‌ మసాలా


ఆవనూనె - పావుకప్పు కలోంజీ గింజలు(బజార్లో దొరుకుతాయి) వాము - ఒకటిన్నర చెంచా చొప్పున వెల్లుల్లి ముక్కలు - రెండు టేబుల్‌స్పూన్లు ఉల్లిపాయలు - మూడు (సన్నగా తరగాలి) టొమాటోలు - రెండు (సన్నగా తరగాలి) అల్లం తరుగు - చెంచా పచ్చిమిర్చి - మూడు కరివేపాకు రెబ్బలు - మూడు ఎముకల్లేని చికెన్‌ - కేజీ టొమాటో ముద్ద - టేబుల్‌స్పూను కారం - మూడు చెంచాలు మిరియాలపొడి - చెంచా జీలకర్రపొడి - చెంచా ధనియాలపొడి - అరచెంచా ఉప్పు - తగినంత కొత్తిమీర - కట్ట.

  • బాణలిలో నూనె వేడిచేసుకోవాలి. ఇందులో కలోంజీ గింజలూ, వామూ వేయించాలి. రెండు నిమిషాల తరవాత వెల్లుల్లి, అల్లం తరుగూ, ఉల్లిపాయ టొమాటో, పచ్చిమిర్చి ముక్కలూ వేయించాలి.

  • ఉల్లిపాయ ముక్కలు రంగు మారాక కరివేపాకూ, శుభ్రం చేసిన చికెన్‌ ముక్కలూ, కాసిని నీళ్లూ, టొమాటో ముద్దా వేసి బాగా కలపాలి.

  • చికెన్‌ కొద్దిగా ఉడికాక కారం, మిరియాలపొడీ, జీలకర్రపొడీ, ధనియాలపొడీ, తగినంత ఉప్పూ వేసి మంట తగ్గించి మూత పెట్టేయాలి. చికెన్‌ మెత్తగా అయ్యాక కొత్తిమీర తరుగు వేసి దింపేస్తే చాలు.

No comments:

Post a Comment