VTStyles

Recent Post

Tuesday, 21 June 2016

Curry - NonVeg - Vinegar Chicken

వినెగర్‌ చికెన్‌


1/4 కప్పు నూనె రెండు చెంచాల వెల్లుల్లి 1/2 కప్పు తరిగిన ఉల్లిగడ్డలు 1/4 కప్పు అల్లం పేస్టు 1/2 చెంచాడు పసువు ఒక కేజి చికెన్‌ (ఉడికించి చిన్న ముక్కలుగా చేయాలి) 1/2 చెంచా ఎర్రమిర్చి 1/4 సోయ సాస్‌ ఒక కప్పు వెనిగర్‌ 1/2 కప్పు సన్నగా తరిగిన ఎర్ర క్యాప్సికం. కొబ్బరి పాలు రెండు కప్పు

  • మొదట మూకుట్లో నూనె వేసి వేడి చేసిన తరువాత వెల్లుల్లి, ఉల్లి ముక్కలను వేసి కాసేపు వేగించండి. ఆతరువాత అల్లం, పసుపు వేసి కలియబెట్టండి. కొద్ది సేపటి తరువాత బాయిల్డ్‌ చికెన్‌ను ఇందులో వేసి అయిదు నిమిషాలు ఉంచండి.

  • .ఆ తరువాత దీనిలో వెనిగర్‌,సోయసాస్‌, తరిగిన మిర్చీలను వేసి బాగా కలియబెట్టండి. కొద్ది సేపటి తరువాత కొబ్బరి పాలు దీనిలో పోసి, సన్నగా తరిగిన ఎర్ర క్యాప్సికం ను కూడా వే సి కలపండి.కొద్ది పాటి సెగపై 20 నిమిషాలు ఉంచండి.

  • .తగినంత ఉప్పు వేసి కలిపి దించండి. దీనిని వేడి వేడి అన్నంతో కలిపి తింటే రుచిగా ఉంటుంది. (చికెన్‌ ఇష్టంలేని వాళ్లు ఆలుగడ్డ, గుమ్మడికాయ ముక్కలతో ఈ కూర చేసుకోవచ్చు).

No comments:

Post a Comment