ఆలూ రైతా |
ఆలు - 2 పెరుగు - 2 కప్పులు పచ్చిమిర్చి - 2 వెల్లుల్లి - 2 రేకలు జీరాపొడి - అర టీ స్పూను పుదీనా ఆకులు - 1 టేబుల్ స్పూను ఉప్పు - రుచికి తగినంత.
ముందుగా ఆలుగడ్డల్ని మెత్తగా ఉడికించి తొక్కతీసి మెదిపి పెట్టుకోవాలి.
పచ్చిమిర్చి, పుదీనా, వెల్లుల్లి గ్రైండు చేసుకోవాలి. తర్వాత పెరుగులో మెదిపిన ఆలు గుజ్జు, పుదీనా మిశ్రమం, జీరాపొడి, ఉప్పు వేసి బాగా కలపాలి.
ఈ రైతా పరాటాల్లోకి, అన్నంలోకి బాగుంటుంది.
No comments:
Post a Comment