VTStyles

Recent Post

Friday, 29 July 2016

Drinks - Juice - Rose Sharbath / గులాబీ షర్బత్‌

గులాబీ షర్బత్‌


గులాబీరేకలు - రెండుకప్పులు పంచదార - కప్పు యాలకులపొడి - అరచెంచా నిమ్మకాయలు - రెండు (రసం తీసుకోవాలి).

  • గులాబీ రేకల్ని కడిగి, తుడిచి మరీ మెత్తగా కాకుండా దంచి ఓ పాత్రలోకి తీసుకోవాలి. ఇందులో కప్పు వేడి నీళ్లు చేర్చి, యాలకులపొడి చల్లాలి. బాగా కలిపి మూతపెట్టేయాలి. ఓ రాత్రంతా నాననివ్వాలి.

  • మర్నాడు దీన్ని వడకట్టి పంచదార కలపాలి. దీన్ని వేడిచేయాల్సిన అవసరంలేదు. ఇందులో నిమ్మరసం కలిపి ఫ్రిజ్‌లో ఉంచేయాలి. ఇది మూడురోజుల దాకా నిల్వ ఉంటుంది.

  • తాగాలనుకున్నప్పుడు సగం దాకా చల్లని నీళ్లు తీసుకుని పానీయాన్ని కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. కమ్మని ఈ షర్బత్‌ శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. దీన్ని చల్లని పాలతో కూడా కలిపి తీసుకోవచ్చు.

No comments:

Post a Comment