VTStyles

Recent Post

Friday, 29 July 2016

Starters - NonVeg - Thai Fried Half Boiled Eggs / థాయ్‌ ఫ్రైడ్‌ హాఫ్‌ బాయిల్డ్‌ ఎగ్స్‌

థాయ్‌ ఫ్రైడ్‌ హాఫ్‌ బాయిల్డ్‌ ఎగ్స్‌


వేగించిన ఉల్లి తరుగు- 1/2 కప్పు నూనె- 1 టేబుల్‌ స్పూను హాఫ్‌ బాయిల్డ్‌ గుడ్లు- 4 టమోట సాస్‌- 2 టీ స్పూన్లు చిల్లీ సాస్‌- 1/2 టీ స్పూను వెనిగర్‌- 1/4 టీ స్పూను నీళ్ళు- 3 టీ స్పూన్లు క్యాప్సికం తరుగు- 1/2 కప్పు కొత్తిమీర తరుగు- 1 టీ స్పూను ఉప్పు- రుచికి సరిపడా

  • ఒక బాణలిలో నూనె వేసి దానిలో గుడ్లు దోరగా వేగించి తీసి, సగానికి ముక్కలుగా కోసి సర్వింగ్‌ ప్లేట్‌లో ఉంచుకోవాలి.

  • తరవాత ఆ బాణలిలోనే క్యాప్సికం ముక్కలు వేసి కొద్దిసేపు వేగించి తీసేసి టమోట సాస్‌, చిల్లీ సాస్‌, వెనిగర్‌ వేసి బాగా కలిపి ఒక నిమిషం పాటు ఉడికించాలి.

  • తరువాత నీళ్ళు పోసి కొద్దిగా జారుగా చేసి ఉప్పు కలపాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని ప్లేటులోని ముక్కలపై పోసి ఉల్లి తరుగు, క్యాప్సికం ముక్కలు, కొత్తిమీర తరుగు జల్లాలి.

No comments:

Post a Comment