
చట్నీ కబాబ్
ఉడికించి మధ్యకు కోసిన గుడ్లు - నాలుగు గుడ్లు - రెండు (తెల్లసొన మాత్రమే తీసుకోవాలి) నూనె - వేయించేందుకు సరిపడా.
చట్నీ కోసం:
కొబ్బరితురుము - ముప్పావుకప్పు పచ్చిమిర్చి - రెండు అల్లంవెల్లుల్లి పేస్టు - అరచెంచా కొత్తిమీర - కట్ట నిమ్మరసం - చెంచా ఉప్పు - తగినంత.
చట్నీకోసం సిద్ధం చేసుకున్న పదార్థాలన్నింటినీ మిక్సీజారులోకి వేసుకుని మెత్తగా చేసుకుని ఓ గిన్నెలోకి తీసుకోవాలి.
ఉడికించిన గుడ్డు ముక్క ఒకటి తీసుకుని దానిపై ఈ చట్నీ రాయాలి. ఆ ముక్కను తెల్లసొనలో జాగ్రత్తగా ముంచి.. కాగుతోన్న నూనెలో ఉంచి.. జాగ్రత్తగా వేయించుకోవాలి.
ఇలాగే మిగిలిన గుడ్డు ముక్కల్నీ చేసుకుంటే చాలు. వీటిని వేడివేడిగా సాస్‌తో కలిపి తీసుకోవచ్చు.
No comments:
Post a Comment