VTStyles

Recent Post

Friday, 29 July 2016

Starters - NonVeg - Mutton Kofta Kabab / కోఫ్తా కబాబ్‌

కోఫ్తా కబాబ్‌


కీమా - అరకేజీ అల్లం వెల్లుల్లి ముక్కలు - రెండున్నర చెంచాల చొప్పున ఉల్లిపాయలు - రెండు (తరగాలి) గుడ్డు - ఒకటి మొక్కజొన్నపిండి - ఒకటిన్నర టేబుల్‌స్పూను ఆలివ్‌నూనె - ఒకటిన్నర టేబుల్‌స్పూను ధనియాలపొడి - చెంచా దాల్చినచెక్కపొడి - పావుచెంచా జీలకర్ర పొడీ వాము పొడి - అరచెంచా చొప్పున కొత్తిమీర పుదీనా తరుగు - టేబుల్‌స్పూను చొప్పున పైన్‌నట్స్‌ - రెండు టేబుల్‌స్పూన్లు (బజార్లో దొరుకుతాయి) జీలకర్ర - అరచెంచా ఉప్పు - తగినంత.

  • నూనె, పైన్‌ నట్స్‌, జీలకర్ర తప్ప మిగిలిన పదార్థాలన్నీ మిక్సీజారులోకి తీసుకుని కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ మెత్తని ముద్దలా చేసుకోవాలి.

  • ఇప్పుడు ఓవెన్‌ని ముందుగా వేడిచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండల్లా చేసుకుని బేకింగ్‌ ట్రేలో ఉంచి పది నుంచి పన్నెండు నిమిషాలు బేక్‌చేసుకోవాలి.

  • ఇప్పుడు బాణలిలో నూనె వేడి చేసి, ఈ కబాబ్‌లను ఉంచి, ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. వీటిపై పైన్‌నట్స్‌, జీలకర్ర కూడా వేసి వేయించుకుంటే చాలు. కావాలనుకుంటే మరికొంచెం ఉప్పు వేసుకోవచ్చు.

No comments:

Post a Comment