
పెప్పర్ ఎగ్ రోస్ట్
ఉడికించిన గుడ్లు- 4 పసుపు- 1/4 టీ స్పూను వెల్లుల్లి- 4 రేకలు మిరియాలు- 1/2 టీ స్పూను జీలకర్ర- 1/4 టీ స్పూను సోంపుగింజలు- 1/4 టీ స్పూను ఉప్పు- రుచికి సరిపడా నూనె- 1 టేబుల్ స్పూను
ముందుగా వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర, సోంపులను మిక్సీలో వేసి పొడిచేసుకోవాలి.
తరువాత ఒక బాణలిలో నూనె వేడిచేసి, పసుపు వేసి అర నిమిషం తరువాత మిరియాలపొడి మిశ్రమాన్ని కూడా వేసి పచ్చి వాసన పోయేవరకూ వేగించుకోవాలి.
తరువాత గుడ్లను సగానికి కోసి, వాటిని కూడా వేసి బాగా వేగించుకోవాలి.
No comments:
Post a Comment