తాటిపండు హల్వా
తాటిపండు గుజ్జు- ఒకటిన్నర కప్పు కార్న్ ఫ్లోర్- 1/2 కప్పు నీళ్ళు- 1/2 కప్పు పంచదార- 1/2 కప్పు యాలకుల పొడి- 1/4 టీ స్పూను నేతిలో వేగించిన డ్రైఫ్రూట్స్- 1/4 కప్పు నెయ్యి- 1 టేబుల్ స్పూను ఉప్పు- చిటికెడు.
కడాయిలో నెయ్యి వేడిచేసి తాటిపండు గుజ్జు, ఉప్పు వేసి ఐదు నిమిషాలు సన్నటి సెగమీద కలుపుతూ ఉడికించాలి.
తరువాత నీటిలో కరిగించిన కార్న్‌ఫ్లోర్, పంచదార, డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి కూడా వేసి బాగా చిక్కబడే వరకూ కలుపుతూ ఉడికించాలి.
ఆ తరువాత మిశ్రమాన్ని నెయ్యి రాసిన పళ్ళెంలో సమానంగా పరిచి, చల్లారాక ముక్కలు కోయాలి.
No comments:
Post a Comment