VTStyles

Recent Post

Saturday, 30 January 2016

Bake - Pudding - Egg Pudding

ఎగ్‌ పుడ్డింగ్‌


కోడిగుడ్లు: రెండు పంచదార: 100 గ్రా. పాలు: పావులీటరు జాజికాయ: ఒకటి వెనీలా ఎసెన్స్‌: రెండు చుక్కలు

  • ఓ గిన్నెలో గుడ్లు, పాలు, నాలుగు టేబుల్‌స్పూన్ల పంచదార వేసి పంచదార కరిగేవరకూ గిలకొట్టాలి.

  • మిగిలిన పంచదారను ఓ చిన్న గిన్నెలో వేసి ఓ నిమిషం కరిగించి. ఓవెన్‌లో పెట్టే గిన్నెల్లో అడుగున నెమ్మదిగా పరచుకున్నట్లుగా పోయాలి. చల్లారాక దానిమీద గుడ్డు పాల మిశ్రమాన్ని నెమ్మదిగా పోయాలి.

  • ఇప్పుడు బేకింగ్‌ ట్రేలో నీళ్లు పోసి మిశ్రమం పోసిన గిన్నెల్ని పెట్టి వాటిని అల్యూమినియం ఫాయిల్‌తో కప్పేయాలి.

  • ఈ ట్రే మొత్తాన్నీ ఓవెన్‌లో పెట్టి సుమారు అరగంటసేపు 150 డిగ్రీల సెంటీగ్రేడు దగ్గర బేక్‌ చేసి తీయాలి.

  • లేదంటే చిన్న చిన్న స్టీలు గిన్నెల్లో పోసి ఇడ్లీ కుక్కర్‌లో పెట్టి ఆవిరిమీద ఉడికించవచ్చు. బయటకు తీసి చల్లారాక వీటిమీద బాగా గిలకొట్టిన క్రీమ్‌తో అలంకరించి అందించాలి.

No comments:

Post a Comment